ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. లోక్ సభ ఎన్నికల సమయంలోనూ, రాజ్యసభకు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు లక్కీ ఛాన్స్ మిస్ కావడంతో ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పైనే కూటమి పార్టీల్లో కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ నాగబాబు కేబినెట్ లో చేరేది ఎప్పుడనేది ఆసక్తికర డిబేట్ గా మారింది.

జనసేనకు ప్రస్తుతం పవన్ తో పాటుగా ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన నుంచి బీసీ వర్గాలకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు పెండింగ్ స్థానంలో జనసేన తరపున బీసీ వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే చర్చ జనసేన మద్దతు దారుల్లో వినిపిస్తోంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో నారా - మెగా కుటుంబాలకు పదవులు దక్కటం.. నందమూరి కుటుంబానికి పదవులు ఇవ్వకపోవటం పైనా చర్చ కొనసాగుతోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య కు మంత్రి పదవి ఇవ్వకుండా ..ఇప్పుడు నాగబాబు కు ఇవ్వటం ఏమిటనే చర్చ సోషల్ మీడియా కేంద్రంగా సాగుతోంది. ఇదే సమయంలో టీడీపీలోనూ దీనిపైన ఆసక్తి కర చర్చ జరుగుతోంది.

పైగా ఈ సారి మంత్రివర్గంలో టీడీపీ నుంచి సీనియర్ నేతలైన పలువురు ఆశావాహులకు స్థానం దక్కకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జనసేనకు చెందిన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచనపై టీడీపీలో గుసగుసలు మొదలయ్యాయని అంటున్నారు. అయితే, చంద్రబాబు మంత్రివర్గంలోకి నాగబాబుకు అవకాశం పై ప్రకటన చేయటంతో ఈ నిర్ణయం నుంచి వెనక్కు తీసుకునే అవకాశం లేదని.. మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం టీడీపీ - జనసేనలో జరుగుతున్న చర్చ పైన రెండు పార్టీల అధి నాయకత్వం ఆరా తీస్తోంది. దీని పైన చంద్రబాబు - పవన్ ఎలా ముందుకు వెళ్తారనే అంశం పైన ఆసక్తి కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos