ఏపీలో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమికి సేవ చేద్దామని అమెరికా నుంచి వచ్చిన వారిని కూడా దండం పెట్టి వెళ్లిపొమ్మని మేమే చెబుతున్నామన్న పద్దతిలో పారిశ్రామిక పాలసీ ఉండేది. అప్పుడు పెట్టుబడులు వద్దు.. ఉద్యోగాలు వద్దు.. అందర్నీ బిచ్చగాళ్లుగా చేసి తాము వేసే బిచ్చం తీసుకుని ఓట్లు వేస్తే చాలనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. దేశంలోనే అతి పెద్ద ఎఫ్‌డీఐలు వస్తున్నాయి. పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. అప్పట్లో పెట్టుబడుల్ని తరిమేసిన వాళ్లు ఊరుకుంటారా.. ఇప్పుడు ఆ పెట్టుబడులపైనా ఏడుస్తున్నారు. కుట్రలు చేస్తున్నారు.

డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని.. ఉద్యోగాలు రావని.. నీరు, నిధులు భారీగా ఖర్చు అవుతాయని కొత్తగా వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఏమీ అవసరం లేకుండా.. ఏ అవసరాలు తీర్చకుండానే వచ్చి పెట్టుబడులు పెట్టేస్తారా ?. డేటా సెంటర్లకు ప్రభుత్వం తరపున కల్పించే సౌకర్యాలు చాలా తక్కువ. వారికి కావాల్సిన నీరు, విద్యుత్ ను వారే సమకూర్చుకునేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టేలా తమ డీపీఆర్ లో పెట్టుకున్నారు. గూగుల్ రూ.యాభై వేల కోట్లతో డేటా సెంటర్ పెడితే.. ఇందులో ఇరవై వేల కోట్లు విద్యుత్ నీరు సమకూర్చుకునేందుకు ఖర్చు పెడుతోంది. కొత్తగా ఆసక్తి వ్యక్తం చేసిన రైడెన్ ఇన్ఫోటెక్ అయినా అంతే. కానీ డేటా సెంటర్లు పెడితే కరువు వచ్చేస్తుందని ప్రతిపక్ష నేతలు అతి తెలివి చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

అదే జగన్ రెడ్డి హయాంలో అదానీకి డేటా సెంటర్ పెడుతున్నారంటే.. ఆహా..ఓహో అని ఈ పెద్ద మనుషులే ప్రచారం చేశారు. ఆ డేటా సెంటర్ కు భూమి లీజుకు ఇవ్వడమే కాదు.. ఏకంగా కొండను రాసిచ్చేశారు. ఇప్పుడు గూగుల్ కోసం ఎక్కడో భూములు ఇస్తూంటే.. మాత్రం కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం..గూగుల్ కు మెయిల్స్ పెట్టడమే కాదు.. వాటి వల్ల సమస్యలు  వస్తాయని ప్రచారం చేస్తున్నారు.  సాధారణంగా రాష్ట్ర ప్రయోజనాలు, యువత ప్రయోజనాలను చూసుకునేలా ఇతర పార్టీల రాజకీయాలు ఉంటాయి. తెలంగాణలో పెట్టుబడుల్ని కేటీఆర్ ఏ మాత్రం వ్యతిరేకించరు. వెళ్లిపోతున్నాయని.. వాటిని ఆకర్షించాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. తమిళనాడు, కర్ణాటకలోనూ అంతే. కానీ ఏపీ దౌర్భాగ్యం ఏమిటంటే.. ఏపీకి ఎంతో కష్టపడి పెట్టుబుడులు తెస్తూంటే.. వాటిని వెళ్లగొట్టేందుకు మాత్రం  ప్రతిపక్ష నేతలు రెడీగా ఉంటారు. ఇలాంటి రాజకీయనేతల్ని భరించడం ఏపీ ప్రజల దౌర్భాగ్యముని పలువురు రాజకీయ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos