సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని వైసీపీ అధినేత జగన్ ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్)లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఎన్సీఎల్టీలో గత ఏడాది ఈ పిటిషన్ జగన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు ఎన్సీఎల్టీ విచారించింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది ట్రైబ్యునల్ ను కోరడంతో తదుపరి విచారణను మార్చి 6కి ట్రైబ్యునల్ వాయిదా వేసింది. పిటిషన్ వివరాల్లోకి వెళితే... సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో తనకు 51.01 వాటా ఉందని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. భవిష్యత్తులో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా 2019 ఆగస్ట్ 31న ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. అయితే తనకు తెలియకుండానే, బదిలీ ఫారాలు, డాక్యుమెంట్లు, సంతకాలు లేకుండానే షేర్లను బదిలీ చేసుకున్నారని చెప్పారు. ఇది కంపెనీ చట్టానికి విరుద్ధమని చెప్పారు. షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరిట ఉన్న 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని ట్రైబ్యునల్ ను కోరారు. దీనిపైన విచారణ జరిపిన ట్రైబ్యునల్ తదుపరి విచారణను మార్చి ఆరవ తేదీకి వాయిదా వేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos