ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు నేతలు వారి ఆస్తుల వివరాలను ఓపెన్‌గా చెబుతుంటారు. కొందరు మాత్రం ఆ వివరాలను కాస్త రహస్యంగానే ఉంచుతారు. ఈ మాజీ ఎంపీ మాత్రం అలా కాదు.. సోషల్ మీడియా వేదికగా తన ఆస్తుల చిట్టా మొత్తాన్ని ఓపెన్‌గా చెప్పేశారు. తనకు ఉన్న ఇళ్లు, స్థలాలు, పొలాలు, ఖరీదైన కార్లు, బైక్‌తో సహా వివరాలను బయటకు చెప్పేశారు.. ఇంతకీ ఆయన ఎవరనే కదా మీ అనుమానం.. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. ఫేస్‌బుక్ వేదికగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. 

'ఇవి నాకున్న కార్లు, ఒక బుల్లెట్. ఇంకోటి స్కార్పియో ప్రచార రధం, Volkswagen Jetta కూడా ఉన్నాయి. Volvo వర్షంలో మునిగి పోయి చెడి పోయింది. అది అమ్మేసాను. BYD ఎందుకు కొన్నానంటే ప్రతి నెల లక్ష రూపాయలు రామకృష్ణ మఠం ఎదురుగా ఉన్న భారత్ పెట్రోలియం బంక్ కు కడతాను. ఇది ఎలక్ట్రికల్ కార్ హైద్రాబాద్ వెళ్లాలంటే 500 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 km వెళ్ళవచ్చు. పనికిమాలిన ఊహాగానాలు మానేయండి. ప్రతి కారు ఫైనాన్స్ లొనే కొన్నుకుంటాము. ప్రతి కారుకు లెక్క పత్రాలు ఉంటాయి. ఇకపోతే రాజమండ్రిలో 1000 గజాలలో 10 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది . వైజాగ్ లో ఆక్సిజన్ టవర్స్‌లో 35వ ఫ్లోర్‌లో 3 కోట్ల విలువ చేసే ప్లాట్ ఉంది. అమలాపురంలో ఒక ఇల్లు కొంటున్నాను.. ట్రాన్సాక్షన్ పూర్తి అవ్వలేదని" పేర్కొన్నారు.

ముమ్మిడివరం లో రెండున్నర ఎకరాల మామిడి తోట ఉంది. ఒక అర ఎకరం 4th బ్రిడ్జి హైవే మీద ఉంది. దానిలో ఫుడ్ కోర్ట్ , ఫంక్షన్ హాల్ , స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. 3 ఎకరాల ఫార్మ్ హౌస్ ఉంది. అది కాలేజ్ పేరు మీద ఉంటుంది.. ఒక కాలేజీ ఉంది. డిగ్రీ పీజీ, ప్రొఫెషనల్ కోర్సెస్ , ఫాషన్ టెక్నాలజీ ఫార్మసీ కాలేజీ ఉన్నాయి. On line Examination ION ఉంది. దీనిలో ఒక్క ఇల్లు తప్ప ఇంక ఏది నా పేరు మీద ఉండదు.. అన్ని కొడుకుల పేర్ల మీదే ఉంటాయి. మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి నావి అని చెప్పుతున్నాను. ED, Income Tax Department, State ACB అన్ని మీవే కదా.. పంపించండి. ఏ, ఏ ఆస్తులు ఎలా కొన్నానో ఏ ఏ కార్లు ఎలా కొన్నానో తెలుస్తుంది' అంటూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టి మరీ ఆస్తుల వివరాలను ఓపెన్‌గా అందరి ముందు చెప్పారు. ఇంతకీ మాజీ ఎంపీ హర్షకుమార్ తన ఆస్తుల వివరాలు ఎందుకు ఓపెన్‌గా చెప్పారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన ఇటీవల తన కుమారుడితో కలిసి ఓ కొత్త కారు ముందు నిలబడి ఫోటో తీసుకున్నారు. కొందరు ఈ ఫోటోను ప్రస్తావిస్తూ.. ప్రవీణ్ పగడాల కేసుకు లింక్ చేస్తూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ సోషల్ మీడియా వేదికగా స్పందించి, ఆస్తుల వివరాలను వెల్లడించారని అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos