అమరావతి : రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SEU (GNU)తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జిఎన్ యు, ఎపి ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి GNU సుమారు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతోపాటు 500మందికి ఉపాధి లభిస్తుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు మద్దతుగా పెట్టుబడి, సాంకేతికత, ప్రణాళిక రూపకల్పన, ఎక్విప్ మెంట్ లలో GNU బలాలను ఉపయోగించుకోవడం ఈ సహకారం లక్ష్యం. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఈ ఒప్పందం మన విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడంతోపాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న మా ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని అన్నారు. 

రాష్ట్రంలో ఉన్నతవిద్య ప్రమాణాలను మెరుగుపర్చడం, గ్లోబల్ ఎక్స్ పోజర్, పాఠ్యాంశాలను మెరుగుపర్చడం, అధునాతన విద్య, సాంకేతికలను అందించడం, పరిశోధన, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహంచడం ఒప్పందం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రోగ్రామ్ లలో ముఖ్యంగా టెక్నాలజీ, బిజినెస్, ఆరోగ్య హెల్త్ కేర్ లలో జిఎన్ యు నైపుణ్యాలను అందిస్తుంది. అధ్యాపకులు, విద్యార్థుల నడుమ నాలెడ్జి షేరింగ్ ను సులభతరం చేయడం, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రపంచ విద్యా వ్యవస్థల అభ్యసన విధానాలపై అవగాహన కల్పిస్తుంది. అంతర్జాతీయంగా ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా పాఠ్యాంశాలను ఆధునీకరించడం, మెరుగుపర్చడంతోపాటు ఏఐ వంటి రంగాల్లో ఉత్తమ పద్ధతులపై విద్యార్థులకు  జిఎన్ యు శిక్షణ ఇస్తుంది. ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు,  ఆవిష్కరణల ఆధారిత ప్రాజెక్టులకు అవకాశాలను కల్పిస్తుంది. రాష్ట్రంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక పురోగతికి దోహదం పడుతుంది. MIT వంటి ప్రపంచస్థాయి సంస్థలతో GNU సంబంధాలు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా నైపుణ్యాలు, అర్హతలతో కూడిన విద్యార్థులను సన్నద్ధం చేసి... జాతీయ, అంతర్జాతీయస్థాయి ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుంది. 

2002లో స్థాపించబడిన జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SEU జార్జియాలో అతిపెద్ద యూనివర్సిటీగా అవతరించడమేగాక, అంతర్జాతీయంగా పేరెన్నికగన్న డైనమిక్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉంది.  1,100 మందికి నైపుణ్యం కలిగిన అధ్యాపక సిబ్బందిని కలిగి ఉన్న ఈ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన సుమారు 52,500 మంది పూర్వవిద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో స్థిరపడ్డారు. జిఎన్ యు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 4 ఇంటర్నేషనల్ అక్రిడిటేడెట్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్ తోపాటు పలు అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల కొలాబరేషన్ కలిగి ఉంది. ఫండింగ్ తో కూడిన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ లను కూడా నిర్వహిస్తుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos