కర్నూలు జిల్లాలో 19 మందిని బలిగొన్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను మంగళవారం అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. మరోవైపు, బస్సు యజమాని వి.వినోదకుమార్ పరారీలో ఉన్నారని, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్నటేకూరు వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్‌లో బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదైంది. పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య పర్యవేక్షణలో కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబునాయుడు, ఉల్లిందకొండ ఎస్‌ఐ ధనుంజయ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో సాంకేతిక నివేదికలు అత్యంత కీలకం కానున్నాయి. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ), అగ్నిమాపక శాఖల నుంచి నివేదికలు కోరుతూ అధికారులు లేఖలు రాశారు. ఇప్పటికే విజయవాడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్‌ఎల్) నుంచి నివేదిక అందినట్లు సమాచారం. మిగిలిన రెండు శాఖల నుంచి నివేదికలు రాగానే, పక్కా ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పరారీలో ఉన్న బస్సు యజమాని వినోదకుమార్‌ను వీలైనంత త్వరగా పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని దర్యాప్తు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నివేదికలు అందిన తర్వాత ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos