రాయదుర్గం: పవన విద్యుత్ రంగంలో ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌వారం శంకుస్థాపన చేశారు. ఆయా పవన విద్యుత్ ప్రాజెక్టులు రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో నెలకొల్పనున్నారు. ఇందులో భాగంగా సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ ను మంత్రి ప్రారంభించారు. రూ.10వేల కోట్ల పెట్టుబడితో సుజ్లాన్ సంస్థ ఏర్పాటుచేయనున్న పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముందుగా కణేకల్లు మండలం హులికెరకు చేరుకున్న మంత్రి లోకేష్ కు సుజ్లాన్ కంపెనీ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సుజ్లాన్ 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ ను మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఏవీని మంత్రి వీక్షించారు. అంతకుముందు బళ్లారి సమీపంలోని హలకుంది గ్రామంలో సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును మంత్రి సందర్శించారు. సుజ్లాన్ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విండ్ టర్బైన్ పై సంతకం చేశారు. సుజ్లాన్ సంస్థ ప్రస్తుతం 1,700కు పైగా మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏపీలో అతిపెద్ద విండ్ భాగస్వామిగా అవతరించింది. 2030 నాటికి 5వేల మెగావాట్ల అదనపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపన లక్ష్యంగా సుజ్లాన్ సంస్థ ప్రణాళికలు రూపొందించి, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జీ.లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, సుజ్లాన్ గ్రూప్ కో ఫౌండర్, వైస్ ఛైర్మన్ గిరీష్ తంతి, సీఈవో అజయ్ కపూర్, అడ్వైజర్ వీబీ రావు, టాటా పవర్ ఎండీ, సీఈవో సంజయ్ బంగా, సుజ్లాన్ గ్రూప్ డైరెక్టర్ రంజిత్ సిన్హ్ అభయ్ సిన్హ్ పర్మార్, ఎన్ఆర్ఈడీసీఏపీ లిమిటెడ్ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్.కమలాకర బాబు, టోరెంట్ పవర్ డైరెక్టర్ జిగీష్ మెహతా, వారీ ఎనర్జీస్ సీఎండీ హితేష్ దోషి, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos