తాజాగా దావోస్ పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అక్కడ విశేషాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన తాము అక్కడ ఎవరెవరితో భేటీ అయ్యామో వివరించిన చంద్రబాబు.. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో వైఫల్యంపై వస్తున్న విమర్శలపై పరోక్షంగా స్పందించారు. పెట్టుబడుల కంటే వివిధ దేశాల నేతలు, పారిశ్రామిక వేత్తలతో భేటీ అయి నెట్ వర్కింగ్ , బ్రాండ్ మార్కెటింగ్ చేసుకోవడమే కీలకమని అన్నారు.

దావోస్ తనకు కొత్త కాదని, ఈ దేశంలో దావోస్ కు వెళ్లాలని నిర్ణయించి ట్రెండ్ సెట్ చేసింది తానే అన్నారు. 1995 నుంచి దావోస్ కు వెళ్లడం మొదలుపెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. దావోస్ ధనికులు ఉండే ప్రాంతమని, అక్కడికి వెళ్లేందుకు భారతీయులు వెంటనే ఆసక్తి చూపేవారు కాదని, కానీ తాను వెళ్లడం మొదలుపెట్టాక ఎస్ఎం.కృష్ణ వంటి నేతలు రావడం మొదలుపెట్టారన్నారు. బిల్ గేట్స్ కూడా మీరు ఇప్పుడు ఏపీని ప్రమోట్ చేస్తున్నారు కదా అని తనతో అన్నట్లు చంద్రబాబు తెలిపారు.

నాలుగోసారి సీఎం అయ్యాక మళ్లీ దావోస్ వెళ్లి కొత్త బ్రాండ్ ను ప్రమోట్ చేయాల్సి వస్తోందని చంద్రబాబు తెలిపారు. గతంలో కూలిపోయిన ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. దావోస్ లో 27 వన్ టూ వన్ మీటింగ్స్ అయ్యాయని, నాలుగు రౌండ్ టేబుల్ భేటీలు, మూడు కాంగ్రెస్ సెషన్స్, ఓ ఐరాస హ్యాబిటేట్ భేటీ అయ్యిందన్నారు. మంత్రులు లోకేష్, భరత్ 37 మీటింగ్స్ కు హాజరైనట్లు తెలిపారు.

గతంలో హైదరాబాద్ ను తాను ఎలా అభివృద్ధి చేశానో అందరికీ తెలుసన్న చంద్రబాబు.. ఇప్పుడు దావోస్ లో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఎక్కువగా ప్రయత్నించినట్లు వెల్లడించారు. సీఐఐతో కలిసి సింగపూర్ లోని ఐఎంబీని కలుపుకొని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.దావోస్‌ అంటే అందరు ఎన్ని ఎంవోయూలు చేశారని అడుగుతారని, కానీతేల్చి చెప్పేశారు అది ప్రామాణికం కాదని చంద్రబాబు . దావోస్‌లో నాలుగు రోజులు ప్రపంచం మొత్తం వస్తుందని, అక్కడ మనం నెట్ వర్కింగ్ చేసుకోవాలన్నారు. అక్కడ అనేక మంది సీఈఓ లు, కంపెనీల అధిపతులు వచ్చి  భేటీ అయ్యారని తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos