అమెరికా-ఇజ్రాయెల్ మూకుమ్మడిగా దాడులు చేస్తున్నా తట్టుకుంటూ గల్ఫ్ దేశాలతో పాటు ఆయా దేశాల్లో ఉన్న వీరిద్దరి ఆస్తులపై ఇరాన్ (iran) ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ యుద్దం మొదలుపెట్టి ఐదు రోజులు గడుస్తున్నా.. కచ్చితంగా ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్దితిలోకి అమెరికా-ఇజ్రాయెల్ ను ఇరాన్ నెట్టేసింది. దీని వెనుక ఇరాన్ సాగిస్తున్న డ్రోన్ దాడులే కీలకంగా మారాయి. ముఖ్యంగా చౌకపాటి డ్రోన్ లతో ప్రత్యర్థుల భారీ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న ఇరాన్ వ్యూహంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇరాన్ డ్రోన్ దాడులపై స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా చిన్నపాటి ఆత్మహుతి డ్రోన్లతో ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడుల్లో అమెరికా-ఇజ్రాయెల్ కు చెందిన భారీ ఆస్తులకు ఎలా నష్టం వాటిల్లుతుందో వివరించారు. ఇరాన్ యుద్ధంలో, ఒక పాఠం స్పష్టంగా ఉందని, తక్కువ ధర "ఆత్మాహుతి" డ్రోన్‌లను అధిక ధర గల వాయు రక్షణ వ్యవస్థలను ముంచెత్తడానికి, ఖాళీ చేయడానికి ఉపయోగిస్తున్నారని సాయిరెడ్డి తెలిపారు. భారతదేశం ఈ మార్పును గమనించాలని సాయిరెడ్డి సూచించారు. పెద్ద, ఆధునిక డ్రోన్ ఆయుధశాల, బలమైన ప్రతి-డ్రోన్ సామర్థ్యాలను నిర్మించడం ద్వారా యుద్దానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సాయిరెడ్డి సలహా ఇచ్చారు. మామూలు పరిస్ధితుల్లో అయితే సాయిరెడ్డి ఇచ్చిన ఈ సలహాకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదేమో కానీ ఇప్పుడు అమెరికా - ఇజ్రాయెల్ పై ఇరాన్ చేస్తున్న డ్రోన్ దాడులు, గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ టర్కీ ఇచ్చిన డ్రోన్లతో పాకిస్తాన్ భారత్ పై చేసిన డ్రోన్ దాడుల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos