జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నేడు గురువారం అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు వెలగపూడికి చేరుకుని మధ్యాహ్నం 2.50 గంటలకు సాగునీటి సంఘాల సమావేశంలో పాల్గొంటారు. సాగునీటి సంఘాలు నీటి నిర్వహణ, నీటిని వృధా చేయకుండా ఎలా వినియోగించుకోవాలో వారికి దిశానిర్దేశం చేస్తారు. గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్ధ గాడి తప్పిందని, 18వేల కోట్ల రూపాయిల బిల్లుల బకాయిలను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారని చెప్పనున్నారు.

ఖరీఫ్ పంట ముగిసినా రాయలసీమలో సైతం, రిజర్వాయర్లలో పుష్కలంగా నీరుందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్ మెంట్ వల్లే సాధ్యమైందని ప్రజలకు వివరించాలని చెప్పనున్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకుని, భూమిని కూడా రిజర్వాయర్ లా మార్చుకోవాలని, భూగర్భజలాలు పెంచుకోవాలని, కరువు రహిత రాష్ట్రంగా మార్చుకోవాలనేది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. నీటి భద్రత, వాటర్ మేనేజ్‌మెంట్, భూగర్భజలాల పెంపుపై సాగునీటి సంఘాలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం. 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 12 వేల సాగునీటి సంఘాల అధ్యక్షులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుండి సాగునీటి సంఘాల అధ్యక్షుల రాక ప్రారంభం అవుతుందని, జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.  సదస్సు  బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 6 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్‌ రద్దీ నివారణ దష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు, ట్రాఫిక్‌ డైవర్షన్‌ ప్లాన్‌ అమలు, ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు కేటాయించినట్లు వారు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos