కొత్త సంవత్సరం వేళ చంద్రబాబు కూటమి పార్టీ నేతలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమయ్యారు. ఈ సారి జాబితా పెద్ద సంఖ్యలో ఉంటుందని తెలుస్తోంది. గ‌త రెండు జాబితాల్లో జ‌న‌సేన‌, బీజేపీల‌ కంటే..టీడీపీ నేత‌ల‌కే ఎక్కువగా ప‌ద‌వులు ద‌క్కాయి. కానీ, టీడీపీ నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఈ సారి జాబితాలో తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నా రు. ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. దీంతో, ఎవరికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి.. ఎవరిని నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్దుల కోసం సీట్లు త్యాగం చేసిన  టీడీపీ ఎమ్మెల్యేపై వారికి ఈ లిస్టు లో ప్రాధాన్యత దక్కనుంది. పిఠాపురం వర్మ, దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, మేకపాటి చంద్రశేఖర రెడ్డి లాంటి వారు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న 60 కార్పొరేషన్ల పదవుల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. అందులో బేవరేజెస్ కార్పొరేషన్, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వీటితో పాటుగా అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్, నెడ్ క్యాప్, ప్రణాళిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా కుల సంఘాల పదవులు ఖరారు కావాల్సి ఉంది.

ఈ క్రమంలో ఈ సారి జాబితాలో మూడు పార్టీల నుంచి పదవులు ఆశిస్తున్న వారి పేర్లలో కొందరికి పదవులు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీ ఆశావాహుల్లో గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషా రావు, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవీ సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, మాజీ ఎమ్మె ల్యే రామానాయుడు పేర్లు ఉన్నాయి. జనసేననుంచి అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సీట్లు త్యాగం చేసిన నేతలు ఎమ్మెల్సీ స్థానాల పైన ఆశలు పెట్టుకుంటున్నారు. దీంతో, చంద్రబాబు ప్రకటించే జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos