ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏటీఎం కార్డులను పోలిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టడమే కాకుండా, వాటిలో ఏమైనా తప్పులుంటే సులువుగా సరిచేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ నూతన విధానాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కొత్తగా జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత కార్డుల్లో పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు దొర్లితే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఈ నెల‌ 15వ తేదీ నుంచి 'మనమిత్ర'  వాట్సాప్ సేవ ద్వారా కూడా ఈ మార్పులు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. తప్పులను సరిచేసిన తర్వాత లబ్ధిదారులకు కొత్త కార్డులను ముద్రించి అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆధార్, ఈ-కేవైసీ వివరాల ఆధారంగా ఈ కొత్త కార్డులను రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే, వరుసగా మూడు నెలల పాటు రేషన్ సరకులు తీసుకోని కుటుంబాలకు నాలుగో నెల నుంచి పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తారని స్పష్టం చేశారు. అలాంటి వారు తమ కార్డును సచివాలయాల్లో చూపించి తిరిగి యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు. నవంబర్ 1 తర్వాత కొత్త కార్డు కావాలనుకునే వారు రూ.35 నుంచి రూ.50 వరకు రుసుము చెల్లిస్తే, కార్డును నేరుగా ఇంటి వద్దనే పంపిణీ చేస్తారని వెల్లడించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ స్మార్ట్ కార్డులపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుల పూర్తి వివరాలు, చిరునామా, డిపో ఐడీ వంటివి తక్షణమే తెలుసుకోవచ్చు. కార్డులతో పాటు రేషన్ డిపోల్లో వినియోగించే ఈ-పోస్ యంత్రాలను కూడా ఆధునికీకరిస్తున్నారు. టచ్‌స్క్రీన్, వైఫై, బ్లూటూత్ వంటి సదుపాయాలతో పాటు వేలిముద్రలు పనిచేయని పక్షంలో ఐరిస్ (కంటిపాప) స్కాన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించే సాంకేతికతను ఇందులో పొందుపరిచారు. ఈ నూతన విధానాలతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos