ఇవాళ ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చాలాకాలం తర్వాత వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు.  అందరూ ముందుగానే ఊహించినట్లుగానే సభలో ఆయన హాజరైన తొలి రోజునే ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుపెట్టగానే .. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గట్టిగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినదించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ సభలో పట్టుపట్టారు. 

గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని... గత ఐదేళ్లలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని... ప్రజాభీష్టం మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. దీంతో  వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి కాసేపు నిరసన తెలిపిన అనంతరం  సభ నుంచి వాకౌట్ చేశారు.

కాగా సభ్యులు నిరసన చేస్తున్న సమయంలో జగన్, బొత్స తమ సీట్ల వద్ద నిలబడి మద్దతు ఇచ్చారు. సభ జరుగుతున్న సమయంలో జగన్ తన పార్టీ సభ్యులతో కలిసి సభలో కూర్చోవటం.. వాకౌట్ నిర్ణయం ముందు బొత్సకు సూచనలు చేయడం వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఇవాళ జరగనున్న బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాలపైన చర్చించాలనే విషయం పైన నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు మూడు వారాల పాటు సభ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos