తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు జరిగి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. "రెండేళ్ల క్రితం.. ఇదే రోజున... మా నాన్న చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ ఘటన మా కుటుంబంలోనే కాదు, ప్రజాస్వామ్యంలోనే ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ బాధ ఇప్పటికీ మిగిలే ఉంది... అయినప్పటికీ మా సంకల్పం మరింత బలపడింది. ఆయన ధైర్యం, హుందాతనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అచంచలమైన నమ్మకం... న్యాయం, సత్యం కోసం మా పోరాటానికి స్ఫూర్తినిస్తోంది" అంటూ లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.

అసలు నాడు ఏం జరిగిందంటే... 2023 సెప్టెంబర్ 8న నంద్యాలలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, రాత్రి తన బస్సులో విశ్రాంతి తీసుకుంటుండగా పోలీసులు భారీగా మోహరించారు. సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున 6 గంటల సమయంలో అప్పటి సీఐడీ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలోని బృందం ఆయన్ను అరెస్టు చేసింది. అనంతరం సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపించారు.

టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే, ఈ ప్రాజెక్టు అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ కేసు విచారణలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారు. ఈ అరెస్టు రాజకీయ కక్షసాధింపు చర్యేనని టీడీపీ తీవ్రంగా ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 చోట్ల జయకేతనం ఎగురవేసింది. 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. లోక్‌సభలోనూ కూటమి 21 స్థానాల్లో గెలుపొందగా, వైసీపీ నాలుగు స్థానాలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం అరెస్టుకు గురైన చంద్రబాబు, నేడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులెత్తిస్తుండటంతో ఈ ఘటన... కీలకమైన రాజకీయ మలుపుగా నిలిచిపోయింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos