రంగా ఉద్యమ వారసులుగా మేము అనేక పోరాటాలు చేశామని, వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారని.. కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడలేదని వైసీపీ నేత పోతిన మహేశ్ విమర్శించారు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు.. కానీ, రంగా ఆశయాల కోసం ఎక్కడా నిలబడని వ్యక్తి రాధా అని పోతిన మహేశ్ విమర్శలు గుప్పించారు.

విజయవాడ చెరువు సెంటర్ లో వంగవీటి రంగా 36వ వర్ధంతి నిర్వహించిన వేళ... రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు పోతిన మహేశ్. ఈ సందర్శంగా వంగవీటి రాధాపై సంచలన వ్యాఖ్యలు చేశారాయన. వంగవీటి రంగా అందరి వాడు, కానీ సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ‘రంగా కొడుకు రాధా ఆలోచన అర్ధం కావడం లేదు. కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా వంగవీటి రాధా ఎప్పుడూ బయటకు రాలేదు. అయినా రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయని పోతిన మహేష్ అన్నారు. ప్రజా సమస్యలపై, కాపు సామాజిక వర్గ సమస్యలపై రాధా మాట్లాడకపోవడం నాకు బాధేస్తుందని... ఎన్నికల్లో మాత్రమే రాధా బయటకు వస్తున్నారని... మిగతా అంశాల్లో బయటకు రాకపోవడం రంగా వారసులమైన మాలాంటి వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఆయన ఆవేదన చెందారు.

రంగా పేరు జిల్లాకు పెట్టాలని రాధా ఎక్కడా మాట్లాడడం లేదు.. ఎందుకని అని పోతిన మహేష్ ప్రశ్నించారు. వైట్ కాలర్ నేరస్తులు, పెత్తందారులకు రాధా మేలు చేసినవి అనేకం ఉన్నాయని, రంగా ఆశయాల సాధన కోసం రాధా నడుం బిగించాలని, అధికారంలో ఉన్నప్పుడైనా మాట్లాడకుంటే ఎలా అని ఆయన నిలదీశారు. బీసీ వర్గాల భవిష్యత్తును కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపడం దురదృష్టకరమని పోతిన మహేశ్ వాపోయారు. ఈ విమర్శలపై వంగవీటి రాధా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos