వైసీపీకి రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి క్లారిటీ.ఇచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అయోధ్య రామిరెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులు మీరు వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.. నా రాజీనామాపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని.. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు.

ఇటీవల వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి  రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించినప్పటి నుంచి  ఆ పార్టీలోని ఇతర రాజ్యసభ సభ్యుల వ్యవహారంపై ఊహాగానాలు  వెల్లువెత్తాయి. విజయసాయిరెడ్డి బాటలోనే వైసీపీకి చెందిన మరో ఇద్ధరు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పిస్తారన్న ప్రచారం బలంగా వినిపించింది. వారిద్దరూ నిన్నటిదాకా ఢిల్లీలోనే ఉండిపోవడంతో వారి రాజీనామాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వారు వైసీపీలోనే కొనసాగుతారని తిరుపతి ఎంపీ గురుమూర్తి సహా ఆ పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. తాజాగా అయోధ్య రామిరెడ్డి సైతం తన రాజీనామా వార్తలను ఖండించడం విశేషం.

అయితే ఢిల్లీ ఆపరేషన్ లో భాగంగా ఎన్డీఏ వ్యూహాల మేరకు రాజ్యసభలో వారి బలం పెంచుకునే క్రమంలో వైసీపీ సభ్యులు రాజీనామా చేయడం తధ్యమన్న ప్రచారం కొనసాగుతూనే ఉండటంతో వైసీసీ రాజ్యసభ సభ్యుల రాజీనామా వ్యవహారంలో ఉత్కంఠత కొనసాగుతోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos