ఏపీలో లిక్కర్ పాలసీ బుధవారం నుంచి అమల్లోకి రానుంది. సోమవారం లిక్కర్ షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తారు. రాష్ట్రంలోని 3396 వైన్స్ దుకాణాలకు.. లాటరీ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో లిక్కర్ ధరలను మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న ఈ మద్యం దుకాణాలకు నేడు టెండర్లు ఓపెన్ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల సమక్షంలో షాపులు కేటాయిస్తారు. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2 లక్షల చొప్పున... 89,882 అప్లికేషన్లకు రూ.1797.64 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారి మద్యం దుకాణాలకుఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా ఒక్కో షాపునకు సగటున 52 మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ పోటీ నెలకొంది.

కొత్త పాలసీ ప్రకారం జే బ్రాండ్లకు చాన్స్ ఉండదు. పాపులర్ బ్రాండ్స్ అన్నీ తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం లిక్కర్ ధరల సవరణ పైన గెజిట్ జారీ చేసింది. వైసీపీ హయాంలో అన్నీ జే బ్రాండ్స్ అమ్మేవారు. బూమ్ బూమ్ బీర్ల దగ్గర నుంచి ప్రెసిడెంట్ మెడల్ విస్కీ వరకూ అన్నీ లోకల్ తయారీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేవారు.

మొత్తం మద్యం తయారీ దగ్గర నుంచి మందు బాబులకు చేర్చే వరకూ మొత్తం వైసీపీ వారి గుప్పిట్లోనే ఉండటంతో దోపిడీకి అంతు లేకుండా పోయింది. ప్రభుత్వం మారిన తర్వాత పాలసీ ఖరారు చేయడానికి.. నాలుగు నెలల సమయం పట్టింది. ఇక అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ధరలు కూడా సగానికి సగం తగ్గనున్నాయి. బీర్లు 130 కే లభించే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో ఇవి 220 వరకూ వెళ్లాయి. వైసీపీపై సొంత ఓటర్లు కూడా వ్యతిరేకం అవడానికి ఇదే కారణం. పేదల్ని ఇష్టారీతిన దోచుకున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు.

తాగేవారిని ఆపలేనప్పుడు.. వీలైనంత వరకూ వారి ఆరోగ్యాలను కాపాడటం… మద్యంపై వెచ్చించే మొత్తాన్ని తగ్గించేలా చేసి ఆ కుటుంబాలకు వెసులుబాటు కల్పించడమే కీలకం. ప్రభుత్వం తాజా లిక్కర్ పాలసీని అదే ప్రమాణాలతో డిజైన్ చేసింది. పదహారో తేదీ నుంచి ఏపీలో జే బ్రాండ్లకు ముగింపు లభించనుండటంతో మద్యం ప్రియులు ఖుషీ ఖుషీగా ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos