ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సమయాన మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జగన్ సైతం పార్టీ వీడిన నేతల నియోజకవర్గాల పైన ఫోకస్ చేసారు. కొత్త ఇన్ చార్జ్ లను ఎంపిక చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ పరంగా కీలక కార్యాచరణ అమలుకు జగన్ సమాయత్తం అవుతున్నారు.

పార్టీ వీడిన ముఖ్య నేతల నియోజకవర్గాల్లో కొత్త ఇన్ ఛార్జ్ లను నియమించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీని వీడటంతో అక్కడ వైసీపీ కేడర్ తో జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఆళ్ల నాని స్థానంలో పార్టీ నుంచి కొత్త ఇన్ ఛార్జ్ ను జగన్ ప్రకటించనున్నారు. అదేవిధంగా ఒంగోలు విషయంలోనూ జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, తానే ఒంగోలు వెళ్లి పార్టీ కేడర్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన పార్టీ నేతల నియోజకవర్గాల్లోనూ కేడర్ తో జగన్ సమావేశాలకు సిద్దం అవుతున్నారు.

ఈ క్రమంలో.. జగన్ ఇక పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. పార్టీకి చెందిన రాజ్యసభ.. లోక్ సభ ఎంపీలతో జగన్ రేపు గురువారం సమావేశం అవుతున్నారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మాణాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే నిరసనలో భాగంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్ ను కలిసారు. ఇప్పుడు పార్టీ ఎంపీల భేటీలో పార్లమెంట్ వేదికగా ప్రజలకు సేవ చేయాల్సిన రంగాల్లో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా గళం విప్పాలని నిర్దేశించనున్నారు. అదేవిధంగా రాయలసీమ లిఫ్టు పైనా ఎంపీలకు జగన్ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఢిల్లీ వేదికగా ఎంపీలకు కార్యాచరణ ఫిక్స్ చేయనున్నారు. ఎన్డీఏలో టీడీపీ - జనసేన భాగస్వామిగా ఉండటంతో... ఇక ఢిల్లీలోనూ తమ వాయిస్ బలంగా వినిపించేలా జగన్ ఈ భేటీలో కీలక నిర్ణయం  తీసుకునే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos