నెల్లూరు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి  పర్యటించారు. ఈ సందర్భంగా ఆకుతోట గిరిజనకాలనీ నుంచి ఇందిరా భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు.  గాంధీబొమ్మ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు షర్మిల. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం అందరికీ అవసరమన్నారు. మాజీ సీఎం జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై స్పందించిన షర్మిల.. జగన్ సైడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణం చేయడమే తప్పని... జగన్ షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే సంఘటన జరిగిందన్నారు. ఫేక్ వీడియో అనడం దురదృష్టకరమన్నారు.

జగన్ ప్రతీ విషయంలోనూ ప్రజలను మోసం చేశారని షర్మిల మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జనంలోకి వచ్చిన పరిస్థితి లేదని... ఇప్పుడేమో జనసమీకరణతో బలప్రదర్శన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 'జగన్‌కు నిబంధనలు, ఆంక్షలు ఉండవు. మూడు బండ్లు అంటే, ముప్పై బండ్లతో వెళతారు. జగన్ మోదీ దత్తపుత్రుడనా? కార్ల కింద మనుషులని నలుపుకుంటూ పోతూ, మానవత్వం గురించి మాట్లాడుతారా... జగన్‌కు అసెంబ్లీకి వెళ్లి సమాధానం చెప్పే దమ్ము లేదు. రుషికొండలని ఎందుకు గుండుగొరిగారు.. మద్యపాన నిషేధం చేస్తామని ఎందుకు కుంభకోణానికి పాల్పడ్డారు.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ను నిలబెట్టడానికి తన అవసరం ఉందని పంపించారని తెలిపారు. తనకు, జగన్‌కు ఉన్న విభేదాలు, రాష్ట్ర సమస్యలతో పోల్చితే చాలా చిన్నవన్నారు. జగన్ సీఎం అయిన వెంటనే తమకు విభేదాలు వచ్చాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాడగలదని స్పష్టం చేశారు.

పదిహేనేళ్లుగా ఏపీ ప్రజలను బీజేపీ వెన్నుపోటు పొడుస్తున్నదని షర్మిల విమర్శించారు. ఇప్పుడు పోలవరానికి డబ్బులు ఇస్తామంటున్నారని... అయితే పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా పోలవరం ఎత్తు 45 ఉండాలని ప్రశ్నించే వారేలేరన్నారు.  అన్నదాత సుఖీభవ కింద రైతుకి రూ.20వేలు ఇస్తామని, ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. 80 లక్షల మంది రైతులు ఉంటే, 45 లక్షలకు కుదించారన్నారు. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు బ్రహ్మాండంగా అమలు చేస్తుంటే, ఏపీలో ఇప్పటికీ అమలు కాలేదన్నారు. 'మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుకలు మందమా.. ప్రజలని మోసం చేస్తున్న మీ నాలుకలు మందమా అని షర్మిల నిలదీశారు. వెంటనే అన్ని పథకాలు, హామీలని నెరవేర్చాలని' వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos