రాష్ట్రంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ... వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పోరాటాలకు దిగారు. ఉమ్మడి గుంటూరు తర్వాత.. చిత్తూరు జిల్లాలో పర్యటించారు జగన్. చంద్రబాబు సొంత జిల్లా ఇది. బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించారు. ఇక తాజాగా మరో జిల్లా పర్యటనకు వైఎస్ జగన్ పూనుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారని చెబుతున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు, ఇటీవలే కొవ్వూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరుల దాడిలో నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తారని సమాచారం.

ప్రసన్న కుమార్ రెడ్డికి ధైర్యం చెప్పాలని, ఆయనకు అండగా నిలవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు జిల్లా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలానే నెల్లూరు జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని జగన్ కలుస్తారు. నిజానికి ఈ నెల 3వ తేదీ నాడే జగన్ నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నప్పటికీ- అది సాధ్యపడలేదు.ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, తలశిల రఘురామ్, మేరుగ మురళి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాణి పూజిత ఏర్పాట్లను సైతం పర్యవేక్షించారు. అయితే జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకుంటామని, ఆయన హెలికాప్టర్ ను దిగనివ్వబోమని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించడంతో రాజకీయ దుమారం చెలరేగింది.

దీంతో జగన్... తాత్కాలికంగా తన నెల్లూరు పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడీ పర్యటన ఈ నెల 17వ తేదీన జగన్ చేపడతారని పార్టీ జిల్లా నాయకులు చెబుతున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాకాణితో పాటు ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శిస్తారని అంటున్నారు. ఈసారి జగన్ పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos