వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. గంటల తరబడి సుదీర్ఘంగా..చూసి చదువుతూ తన హావభావాలు చూపించేందుకు తంటాలు పడ్డారు. అసలు ఆయన ఏ టాపిక్ చెప్పాలనుకున్నారో.. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఏ రాజకీయనాయకుడు అయినా ఓ నిర్దిష్ట అంశంపై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ పెట్టి తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ జగన్ రెడ్డి రూటే వేరు.ఆయన చెప్పిందే చెబుతారు. గత ప్రెస్ మీట్లలో చెప్పిందే చెబుతారు. చివరికి ఆయన ఏదైనా కొత్త పాయింట్ చెప్పినా ఎవరూ పట్టించుకోరు.

జగన్ రెడ్డి తాను ఏపీకి వచ్చానని చెప్పుకునేందకన్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన డేటా సెంటర్ పై స్పందించాలనుకున్నారు. చంద్రబాబు క్రెడిట్ లేదని..తనదేనని చెప్పుకోవాలనుకున్నారు. దాన్ని చెప్పుకోవడానికి ఎఫెక్టివ్ గా ఓ అరగంటలో చెప్పేస్తే.. ఆయన మాటలు ప్రజల్లోకి వెళ్లేవి. కానీ ఎప్పటిలా సోది అంతా చెప్పి మధ్యలో ఆ టాపిక్ వద్దకు వెళ్లే సరికి అందరూ ఆయన ప్రెస్ మీట్ ను పట్టించుకోవడం మానేశారు. ఎవరూ పట్టించుకోవడం లేదని చివరికి బాలకృష్ణ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.

బాలకృష్ణ తాగి వచ్చారో లేదో జగన్ ఏమైనా వాసన చూశారా అని నెటిజన్లు అడుగుతున్నారు. పోనీ ఆయన పార్టీ సభ్యులు ఎవరైనా వాసన చూశారా అంటే..ఎవరూ అసెంబ్లీలో లేరు. మరి ఎందుకు ఆయన మాట్లాడటం.. పైగా ఈ టాపిక్ ముగిసిపోయి చాలాకాలం అయింది. జగన్ రెడ్డి స్ట్రాటజిస్టుల మాట వింటారో లేదో.. ప్రతీసారి ఇలా    పెద్దపెద్ద వ్యాసాలతో ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ విసుగు పుట్టించడం తప్ప.. ప్రజల్లోకి తన వాదన వెళ్లే అవకాశమే ఉండదు. అసెంబ్లీకి కూడా వెళ్లని ఆయన ప్రెస్ మీట్లను ఇలా బోర్ క్లాస్‌గా మారిస్తే.. ఎవరు మాత్రం ఆసక్తి చూపిస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos