ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తనపై మీడియా తప్పుడు ప్రచారం చేసిందని వంద కోట్లకు పరువు నష్టం దావాలు వేస్తానని ప్రకటించడమే కాకుండా... ఇందు కోసం ఆయన ఢిల్లీ దాకా పోయారు. ఆయనకు నిత్యం కంటగింపుగా మారిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా పైనే కాకుండా ఆజ్ తక్ గ్రూపుపైనా ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేశారు. అమెరికా ఎఫ్‌బీఐ కేసులో తన పేరు లేకపోయినా… తన పేరు ఉందని ప్రచారం చేశారని తనకు పరువుకు నష్టం జరిగిందని, పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
ఈ విషయాన్ని అలా ఉంచితే... జగన్ రెడ్డి ఇంత సిల్లీగా పరువు నష్టం పిటిషన్ ఎలా దాఖలు చేస్తారన్నది ఆశ్చర్యకరంగా ఉందని చర్చ జరుగుతోంది. సెకి - అదాని ఒప్పందం కేసులో ఆయన పేరు ఉందని ఇప్పటికే డాక్యుమెంట్లతో సహా వెలుగులోకి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే కదా ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రే (ఆ స్టేట్ చీఫ్ ఆఫీసర్) డబ్బులు తీసుకున్నాడని డాక్యుమెంట్లలో స్పష్టం చేశారు. కోర్టులకు ఆ మాత్రం ఈ ఇంగిత జ్ఞానం ఉండదని జగన్ ఎలా అనుకుంటున్నారో కానీ.. నేరుగా ఢిల్లీ హైకోర్టుకు పోయారు.
మరోవైపు ఇలాంటి పిటిషన్లు వేసుకోవడానికి ఏపీ, తెలంగాణలో న్యాయస్థానాలు ఉన్నాయి కదా.. మరి అంత దూరం వెళ్లి ఢిల్లీ కోర్టులో ఎందుకు కేసులు వేశారనేది ప్రశ్నార్థకంగా ఉన్నది. నారా లోకేష్ తనపై సాక్షి తప్పుడు ప్రచారం చేసిందని విశాఖ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడే అప్పట్లో వైసీపీ నేతలు ఎందుకు విశాఖ దాకా వెళ్లి కేసు వేసారని విమర్శించారు. కానీ జగన్ మాత్రం ఇప్పుడు ఏకంగా ఢిల్లీని ఎంచుకోవడం ఆశ్చర్యకరమని రాజకీయ విశ్లేషకులు, పలువురు నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos