నిన్న విజయవాడలో పర్యటించి సబ్ జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించాల్సి ఉంది. కానీ జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మిర్చి యార్డుకు వెళ్లడం, రాజకీయ కామెంట్లు చేయడం, మైకులో మాట్లాడటం నిషేధమని పోలీసులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని పోలీసులు వైసీపీ నేతల్ని హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలో ... వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతోందని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. మాజీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ పర్యటనకు ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని తెలుసు. కానీ మేం ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదని... ఎలాంటి ప్రచారం సైతం చేయట్లేదని... ఇంకా చెప్పాలంటే మిర్చి యార్డులో మైకు కూడా వాడటం లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. దాంతో మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేని పంటల్ని సైతం జగన్ ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయగా, కూటమి  ప్రభుత్వంలో రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆరోపించారు.

కాగా ఇప్పుడు జగన్ మిర్చి రైతులంటూ అత్యుత్సాహం చూపడంపై విమర్శలు వస్తున్నాయి. బెంగళూరులో నాలుగు రోజులు.. తాడేపల్లిలో మూడు రోజులు ఉండే జగన్.. ఈ మూడు రోజులూ ఎవరో ఒకర్ని పిలిపించుకుని మాట్లాడేవారు. ఈ సారి మాత్రం దగ్గరే కదా అని మిర్చియార్డుకు వెళ్లాలనుకున్నారు. కానీ కోడ్ గురించి పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాజకీయ ధర్నాలు, షోలు చేయాలంటే పర్మిషన్ తప్పనిసరి. కానీ అవేమీ పట్టించుకోకుండా ధర్నాకు వస్తున్నారు. దీంతో అధికారులు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు.వైసీపీ నేతలు పోలీసుల్ని బెదిరించి.. తమకు అడ్డం లేకుండా చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు గాక. కానీ ఎన్నికల కమిషన్ ఊరుకుంటుందా అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos