ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో సహచర సభ్యులతో కలిసి మాజీ సీఎం జగన్ నిరసనగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. చేతిలో ప్లకార్డులతో జగన్ సభ వరకు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. శాంతి భద్రతలు కాపాడాలని... మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆపాలని... ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. లడ్డూ పై అసత్య ప్రచారం అంటూ స్లోగన్స్ ఇచ్చారు.

తమ పార్టీ నేతల ఇళ్ల పైన దాడులు జరుగుతున్న అంశాన్ని జగన్ ప్రస్తావించారు. ఇదే తరహాలో కొనసాగితే సహించేది లేదని హెచ్చరించారు. పోడియం ను వైసీపీ సభ్యులు చుట్టు ముట్టటంతో మార్షల్స్ సభలోకి వచ్చారు. కాసేపటికి వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ నుంచి వాకౌట్ చేసారు. ఆ తరువాత పార్టీ సభ్యులతో జగన్ సమావేశమయ్యారు. సభకు వెళ్లే ఎమ్మెల్యేలు వెళ్లవచ్చని జగన్ సూచించినట్లు సమాచారం. అదే విధంగా మండలిలో మాత్రం పార్టీ ఎమ్మెల్సీలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్ల పై దాడులు, ఆర్దిక పరిస్థితి పైన ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్దేశించారు. కాగా.. గవర్నర్ ప్రసంగం అయిన తరువాత బీఏసీ సమావేశం కానుంది. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి .. అజెండా ఖరారు చేయనుంది. బీఏసీకి వైసీపీ దూరంగా ఉండే అవకాశం ఉంది.

దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల గురించి సభ లో చర్చించి.. ప్రజలకు వివరించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా, సమావేశాలు సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉండటంతో... పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ తీసుకునే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos