ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత వరుసగా ముఖ్య నేతలు పార్టీని వీడి... కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ మోపిదేవి, బీదా మస్తాన రావు టీడీపీలో చేరారు. జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను ఇద్దరూ జనసేన కండువా కప్పుకున్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పని చేసిన వాసిరెడ్డి పద్మ సైతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జగన్ పైన తీవ్ర విమర్శలు చేసారు.

ఇక, ఇప్పుడు మాజీ హోం మంత్రి.. జగన్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే మేకతోటి సుచరిత సైతం పార్టీ వీడేందుకు సిద్దమయ్యారని సమాచారం. ఇప్పటికే జనసేనాని నుంచి భవిష్యత్ పైన హామీ దక్కినట్లు సమాచారం. సుచరిత 2009 లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 లో జగన్ కోసం రాజీనామా చేసి ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. తిరిగి 2014లో ఓడిపోయారు. కాగా, 2019లో వైసీపీ అధికారంలోకి రావటంతో సుచరితకు జగన్ హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ ప్రక్షాళన వేళ సుచరిత పదవి కోల్పోయారు. ఆ సమయం లోనే కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉన్నారు. జగన్ ను కలిసిన తరువాత తాను పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసారు. ఇక, 2024 ఎన్నికల వేళ సుచరిత ప్రత్తిపాడు కాదని... తాడికొండ నుంచి పోటీ చేసారు. సుచరిత అభ్యర్ధన మేరకే సీటు కేటాయించినా.. అక్కడ ఓడిపోయారు.

ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తరువాత .. సుచరిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ తాజాగా రెండు సార్లు గుంటూరుకు వచ్చారు. సుచరిత మాత్రం దూరంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలోనే సుచరిత పార్టీ మార్పు పైన ప్రచారం సాగింది. ఇప్పుడు ప్రత్తిపాడు, తాడికొండలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో, సుచరిత జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనలోకి ముఖ్యులతో మంతనాలు పూర్తయినట్లు చెబుతున్నారు. పవన్ నుంచి భవిష్యత్ పైన హామీ ఉందని.. వచ్చే వారం జనసేనానితో సమావేశం కానున్నట్లు సమాచారం. దీంతో, సుచరిత తన నిర్ణయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos