సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిని వదిలిపెట్టేది లేదంటూ సీఎం చంద్రబాబు ఇవాళ గట్టి హెచ్చరికలు జారీ చేయగా... వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు వ్యాఖ్యలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే చాలు... అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

వీళ్ల అఘాయిత్యాలపై ఎవరూ ప్రశ్నించకూడదా? ఆఖరికి వరదసాయంపై నిలదీసినా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక, కరెంట్ చార్జీలు, మద్యం మాఫియాపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా... పోర్టుల ప్రైవేటీకరణపై ఎవరూ ప్రశ్నించకూడదా? ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుంటే ఎవరూ నిలదీయకూడదా? అంటూ జగన్ ధ్వజమెత్తారు. 

"విద్య వద్దు... మద్యం ముద్దు అని ఓ పిల్లవాడు పోస్టు పెట్టాడు. ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చెప్పిన మాటల్లో తప్పేముంది? నిజమే కదా... అమ్మ ఒడి ఇవ్వడంలేదు, విద్యా దీవెన ఇవ్వడం లేదు, వసతి దీవెన ఇవ్వడంలేదు. నాన్నకు ఫుల్లు... అమ్మకు నిల్లు అని ఆ పోస్టులో ఉంది... అందులో ఏం తప్పుంది? చంద్రబాబు గారి అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్టు ఉందని కేసు పెట్టారని జగన్ విమర్శించారు. వారం రోజులుగా ఈ తంతు విచ్చలవిడిగా జరుగుతోందని ... 101 మందిని బుక్ చేసేశారని జగన్ విమర్శించారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని.. ఇలాంటి కేసుల్లో ఇష్టం వచ్చినట్టు ఇంటికొచ్చి అరెస్ట్ చేయకూడదని అన్నారు.

ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు ఓ ప్రొసీజర్ ఉందని... 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని... విచారణ జరిపిన తర్వాత ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాల్సిన అవసరమే వస్తే... ముందు వారెంట్ జారీ చేయాలి.. ఆ తర్వాత మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలని జగన్ అన్నారు. ఇవి నేను చెబుతున్నవి కాదు... ఇవి సుప్రీంకోర్టు ఆదేశాలు. కానీ ఎక్కడా ఆదేశాలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదని అన్నారు. ప్రశ్నించే గొంతుకలు నొక్కేసే విధంగా అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు" అంటూ జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos