వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కాంలో జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అలాగే కస్టడీలోకి తీసుకుని మరింతగా విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాంకు సంబంధించి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో జగన్ జైలుకెళ్లడం, చిప్పకూడు తినకతప్పదని హెచ్చరించారు. జైలుకెళ్లడం తప్పదని అటు జగన్‌కు కూడా తెలుసని, అందుకే ప్రతిరోజూ మీడియా ఎదుట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరు పురుగు పట్టింది. అందుకే ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీని వీడిపోయాడు. మరికొందరు నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంట్రుక పీకడం కాదు.. మా బీజేపీతో పెట్టుకుంటే తిరుమల గుండే. త్వరలో సీబీఐ కేసులో జగన్ జైలుకెళ్లడం ఖాయం.. వివేకా హత్య కేసులో త్వరలో ఎంపీ అవినాశ్ జైలుకెళ్తాడు.ఏపీ రాజకీయాల్లో జగన్ నామరూపాలు లేకుండా చేయడమే మా ధ్యేయం అంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
లిక్కర్ స్కాం జరిగిందంటూ సీఎం చంద్రబాబు బేతాళ కథలు కదలు చెబుతున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆదినారాయణరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులతో రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. అయినా బీజేపీ సహకరిస్తుండటంతో కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos