వల్లభనేని వంశీ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్.. బెదిరింపుల కేసులో వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధించటంతో విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న వంశీ బ్యారక్ వద్ద అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇక..సత్యవర్ధన్ అరెస్ట్ - బెదిరింపుల వ్యవహారంలో సీసీ కెమేరాల్లో పూర్తి ఆధారాలు లభ్యం అయినట్లు సమాచారం. వంశీ పైన పెండింగ్ లో ఉన్న ఇతర కేసుల్లోనూ విచారణకు పోలీసులు సిద్దం అవుతున్నారు.
కాగా, రేపు మంగళవారం మాజీ సీఎం జగన్ .. జైల్లో వంశీని పరామర్శించనున్నారు. ఈ క్రమంలో జైలు వద్ద అధికారులు అత్యంత పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తన భర్త వంశీకి ప్రాణహాని ఉందని .. ఇప్పటికే ఆయన సతీమణి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్య వర్ధన్ ను వంశీ, అనుచరులు కిడ్నాప్.. బెదిరింపులు..వారి ఆగడాల సీసీ కెమెరాల దృశ్యాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు, ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో వంశీ పైన గతంలో పలు వివాదాల్లో నమోదు అయిన కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటిల్లోనూ విచారణ కోసం పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేసేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.
వంశీ, ఆయన మద్దతు దారులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారని.. గన్నవరం టీడీపీ కార్యాలయం కేసులో సంబంధం లేదని బలవంతంగా చెప్పించారని సత్యవర్ధన్ ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. ఇదే వాంగ్మూలాన్ని సీఆర్పీసీ 164 కింద న్యాయాధికారి ముందు చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సత్యవర్ధన్ అంశంపై ఇవాళ న్యాయస్థానం ఏం తెలుస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos