ఏపీలో వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వైసీపీ వర్సెస్ కూటమి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో విజయవాడ జైల్లో వంశీని ఇవాళ పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు. సప్రసముద్రాల అవతల ఉన్నా తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదంటూ అధికారులకు సైతం హెచ్చరికలు చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వల్లూరు జయప్రకాష్ నారాయణ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
విజయవాడలో జగన్ చేసిన కామెంట్స్ పై ఆయన గుంటూరులో స్పందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు చూసి జగన్మోహన్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడన్నారు. విజయవాడలో జైలు ములాఖత్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రేలాపనలు చూస్తే నవ్వొస్తుందని, ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజలందరి బట్టలు విప్పదీసి బజారులో నిలబెట్టిన సంగతిని జగన్ మర్చిపోయినట్లు ఉన్నాడన్నారు.
జగన్ పై ఇప్పటికీ కసితో ఉన్న రాష్ట్ర ప్రజలు ఇప్పుడు.. ఆయన్ను వెంబడించి కొట్టడం ఖాయమని జయప్రకాష్ నారాయణ అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు బట్టలిప్పదీసి కొట్టుకుంటూ నడి బజారులో నడిపించడం ఖాయమంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్టికైనా జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోకుంటే మేమే బట్టలిప్పదీసి తంతామని హెచ్చరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos