టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‍పై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంతో చంద్రబాబు, పవన్ అంతర్గతంగా మాట్లాడుతున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నందున బహిరంగంగా మాట్లాడలేమన్న గోరంట్ల జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆయన మాజీ సీఎం జగన్ గురించి మాట్లాడుతూ... నిన్న జగన్ అపర గోబెల్స్‌లా మాట్లాడారని,  మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని ఆయన అంటున్నారని... ఆయన వచ్చేది అధికారంలోకి కాదని, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వైకాపా హయాంలోని లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. జగన్ హయాంలో పంటలకు బీమా కూడా చెల్లించకపోవడంతో రైతులు రూ.వేల కోట్లు నష్టపోయారు. గత ప్రభుత్వం గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు. జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కించాల్సిందేనని అన్నారు. 

మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజానురంజకంగా పాలిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం సహాయ నిధి ఇచ్చి ప్రజలను ఆదుకుంటున్నాం.. మేలో తల్లికి వందనం, జూన్‌లో అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నామని బుచ్చయ్య చౌదరి అన్నారు. రానున్న పుష్కరాలకు రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నాం. రాజమహేంద్రవరంలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతుందని... ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో ఇప్పటికే మాట్లాడానని ఆయన అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos