ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి నేతలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇటు మాజీ సీఎం జగన్ కౌంటర్ రాజకీయం మొదలు పెట్టారు.  ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ కొంత కాలం మౌనంగా ఉన్నారు. అసెంబ్లీకి దూరమయ్యారు. మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారు. కార్యకర్తలను పరామర్శిస్తున్నారు. కొంత కాలం క్రితం జగన్ జిల్లాల పర్యటనలతో కార్యకర్తలతో మమేకం కావాలని భావించారు. అయితే, ఇంకా కొంత సమయం తీసుకున్న తరువాత జిల్లాల పర్యటనలకు వెళ్తే బాగుంటుందనే సూచనతో జనవరిలోనే ప్రారంభం కావాల్సిన జిల్లాల పర్యటనలు వాయిదా పడ్డాయి. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వరుసగా వైసీపీ నేతల పైన కేసులు నమోదు చేయటం.. వైసీపీ లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు పైన జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమీక్షించారు. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ సుప్రీంకు వెళ్లింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్లటం ద్వారా రాజకీయంగా తేల్చుకొనేందుకు జగన్ ఇక ప్రజల్లోనే ఉండాలని కొందరు నేతలు సూచించగా.. మరి కొందరు కొంత కాలం వేచి చూసే ధోరణితో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతున్న అంశం పైన జగన్ నేరుగా స్పందించలేదు. అయితే, బీజేపీ ఏపీలో చేస్తున్న రాజకీయం పైన మాత్రం అలర్ట్ అయ్యారు. కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉండటంతో టీడీపీ, జనసేన తరహాలోనే బీజేపీతోనూ వ్యవహరించాలని నిర్ణయించారు. జూన్ రెండో వారం నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సమయంలోనే ప్రభుత్వంపైన ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరగటం ఖాయమని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ ఖరారు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos