ఏపీలో ఈ నెల 8న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హెలికాఫ్టర్ ధ్వంసం ఘటన తీవ్ర కలకలం రేపింది. సత్యసాయి జిల్లా రామగిరిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సమయంలో ఆయన హెలికాఫ్టర్ పైకి జనం ఎగబడ్డారు. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసమైంది. ఈ ఘటనతో జగన్ భద్రతా లోపాలు బయటపడ్డాయి. దీనిపై వైసీపీ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆ రోజు హెలికాప్టర్ నడిపిన పైలట్, కో పైలట్  విచారణకు రావాలని సత్యసాయి జిల్లా సీకే దిన్నె పోలీసులు నోటీసులు పంపారు. దీంతో వారు ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 8న జగన్ ను పైలట్, కోపైలట్ హెలికాప్టర్ లో పాపిరెడ్డిపల్లికి తీసుకొచ్చారు. ల్యాండ్ అయిన వెంటనే హెలికాప్టర్ ను వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ ద్వంసం అయింది. అయితే హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్, కోపైలట్ వెళ్లిపోయారు.

దీంతో జగన్ పర్యటన రోజు జరిగిన ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఘటనపై వివరాలు రాబట్టేందుకు పైలట్, కోపైలట్ కు నోటీసులు జారీ చేసి ఇవాళ పిలిపించి విచారిస్తున్నారు. విచారణలో పైలట్, కో పైలట్ చెప్పే వివరాల ఆధారంగా ఇందులో తప్పెవరిదో తేల్చబోతున్నారు. వైసీపీ ఇప్పటికే దీన్ని జగన్ భద్రతలో పోలీసుల లోపంగా పేర్కొంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు పోలీసులు తమ విచారణలో ఏం తేల్చబోతున్నారనేది కీలకంగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos