అసెంబ్లీ సమావేశాల ప్రారంభం.. రాష్ట్రంలో రైతులు నిరసనలు చేపట్టడం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానం.. వంటి ప్రస్తుత పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. ఉద్యమ కార్యాచరణకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం, అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, శాంతిభద్రతలు, పార్టీ కార్యకర్తలపై దాడులు- అరెస్టులు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా అసెంబ్లీని బహిష్కరించడం వైసీపీకి దిద్దుకోలేని తప్పుగా మారనుంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని జగన్ రెడ్డి అంటున్నారు. అసలు అలాంటి కారణం చెప్పి అసెంబ్లీని బహిష్కరించాలన్న ఆలోచన రావడమే సిల్లీగా ఉంటుంది. ఎవరైనా.. ప్రభుత్వ వేధింపులు లేకపోతే మరో బలమైన ప్రజా కోణంలోని కారణంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అది కూడా ఒక్కరే తీసుకుంటారు కానీ.. ఇక్కడ జగన్ రెడ్డి తనకు హోదా లేదని ఇవ్వడం లేదని.. అందర్నీ అసెంబ్లీకి పంపకపోవడం మాత్రం.. ఆయన మనస్తత్వాన్ని ప్రజల ముందు ఉంచింది. దీంతో ప్రజాక్షేత్రంలో వైసీపీ నవ్వుల పాలు అయిపోయింది.

రాజకీయమంటేనే పోరాటం. వెనుకడుగు వేయకూడదు. కానీ జగన్ రెడ్డి.. తాను తన గ్రౌండ్ లో ఆడుకుంటాను.. అంటున్నారు. అసలు మ్యాచ్ కు రాను అంటున్నారు. మీరు గ్రౌండ్ లో ఆడుకోండి.. నేను ఇంట్లో ప్రాక్టిస్ చేసుకుంటానంటున్నారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్లకి రాజకీయాలు వేస్ట్. కుల, మతాలను అడ్డం పెట్టుకుని కాస్త ఓటు బ్యాంక్ ఉంటుంది.. వారంతా గొర్రెలు.. ఎం చేసినా తన వెనకే వస్తారని అనుకునే మైండ్ సెట్‌తో చేసే రాజకీయాలు ఎప్పటికీ వర్కవుట్ కావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పోరాడలేని పార్టీ రాజకీయంగా సమాధి అయినట్లేనని వారు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos