వైసీపీ నేతల భేటీలో నిన్న ఆ పార్టీ అధినేత జగన్ చేసిన పాదయాత్ర ప్రకటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్రకు గల కారణాన్ని వెల్లడించారు. జగన్ తన స్వార్ధ ప్రయోజనాల కోసమే పాదయాత్ర చేస్తానంటున్నారని యనమల రామకృష్ణుడు తెలిపారు. అధికారం అనే కుర్చీ కోసమే జగన్ ప్రయత్నాలని అన్నారు. జగన్ కు ఒక్కసారి కుర్చీ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు.
ఐదేళ్ల జగన్ పాలన రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళు వెనక్కి నెట్టిందని,జగన్ పాలనలో అవినీతి, దోపిడీ, వ్యవస్థీకృత నేరాలు, శాంతిభద్రతల వైఫల్యంతో రాష్ట్రం నిండిపోయిందని యనమల గుర్తుచేశారు. జగన్ పాలనలో ప్రజలు ఇప్పటికే నానా కష్టాలు పడ్డారని, జగన్ అంటే అరాచకం, ధరల పెరుగుదల, సున్నా అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం వంటివే గుర్తొస్తాయని యనమల తెలిపారు. నియంతృత్వ, ఫ్యాక్షనిస్ట్ స్వభావం కలిగిన వ్యక్తి జగన్ అన్నారు. జగన్ ప్రవర్తన హిట్లర్, తుగ్లక్, ముస్సోలినీ తరహాలో ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ప్రజలు ఎప్పటికీ నమ్మరని యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పేశారు.
జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తానని చేసిన ప్రకటనపై ఇప్పటికే మంత్రి పార్థసారథి స్పందించారు. జగన్ చేసిన ఒక్క పాదయాత్రతోనే రాష్ట్రానికి అంచనాకు అందని నష్టం జరిగిందని ఇంకో పాదయాత్ర జరిపితే ఎంత నష్ట పోతారో ప్రజలు ఊహించలేరని ఎద్దేవా చేశారు. ప్రైవేటైజేషన్ కు పీపీపీకి తేడా తెలియని వ్యక్తి అధికారంలోకి వస్తే సీఎం కుర్చీనీ ప్రైవైటైజేషన్ చేస్తారేమోనని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ హయాంలోనే విజయవాడ ఆస్పత్రిలో కార్డియాక్ విభాగాన్ని పీపీపీ విధానం అమలు చేశారని గుర్తు చేశారు. పీపీపీ విధానంలోనే రాష్ట్ర ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా జగన్ కు దళితులు కనపడలేదు. అధికారం పోగానే దళితులు గుర్తుకు వస్తున్నారని మంత్రి పార్థసారథి విమర్శించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos