సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో ఈ కేసులో జగన్ తో కేసు నమోదు చేసిన వైసీపీ నేతల పైన ఎలాంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో, హైకోర్టులో విచారణ తరువాత కోర్టు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఈ కేసులో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

సింగయ్య మృతి కేసులో నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్ ను ఏ-2గా చేర్చారు. దీంతో, జగన్ తో పాటుగా ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ కేసు తొలుత గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదిస్తూ..  తనతోపాటు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తారని.. కేసు డైరీ, ఇతర వివరాలు తెప్పించుకోవలసి ఉందని తెలిపారు. వ్యాజ్యాలపై సోమవారం లేదా మంగళవారం విచారణ చేపట్టాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తో సహా ఇతర న్యాయవాదులు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవని అన్నారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారనే ఆందోళన ఉందని తెలిపారు. వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్టు నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోరారు. తొందరపాటు చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు.

దీంతో దమ్మాలపాటి జోక్యం చేసుకుంటూ.. క్వాష్‌ పిటిషన్‌ ద్వారా అరెస్టు నుంచి రక్షణ కోరలేరని, ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారని పిటిషనర్లకు ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేసుకుని ఉండాల్సిందన్నారు.ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి అంటే ఈరోజు వాయిదా వేశారు. కాగా, ఈ రోజు విచారణను మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి.. జగన్ తో సహా పిటీషన్లు దాఖలు చేసిన నేతల పైన ఎలాంటి తొందర పాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos