వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన ప్రారంభమైంది. మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతుల్ని పరామర్శించేందుకు జగన్ ఈ టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఉదయం తాడేపల్లి నుంచి రోడ్డు మార్గానే జగన్ బయలుదేరి వెళ్లారు. విజయవాడ, పెనమలూరు, పామర్రు మీదుగా పెడన నియోజకవర్గానికి చేరుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చాయి. పెనమలూరు, ఉయ్యూరు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి హైవేపైకి చేరుకున్నారు. జగన్ కు విజయవాడ నుంచి మచిలీపట్నం హైవేపై ఎక్కడికక్కడ ఎదురేగి ఘన స్వాగతం పలికారు. దీంతో పోలీసులు వారిని నియంత్రించాల్సి వచ్చింది. అయినా జగన్ మాత్రం తన అభిమానుల్ని ఎక్కడికక్కడ పలకరిస్తూనే ముందుకు సాగుతున్నారు. మరోవైపు పోలీసులు జగన్ టూర్ నేపథ్యంలో కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఆంక్షలు విధించారు. డీజేలు పెట్టకూడదని, బైక్ ర్యాలీలు తీయొద్దని హెచ్చరికలు చేశారు. అనుమతించిన వాటికి మించి వాహనాలను తీసుకురావొద్దని, జనాన్ని తరలించవద్దని సూచించారు. అలాగే అనుమతి లేకపోతే వైసీపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని జగన్ కు పోలీసులు షరతులు విధించారు. అలాగే 10 వాహనాలు, 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బైక్‌లకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ రైతుల్ని కలిసేందుకు వెళ్తుంటే ఈ ఆంక్షలు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. వైయస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం వరకూ ఈ కార్యక్రమాలు కొనసాగించి తిరిగి సాయంత్రానికి అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి చేరుకుంటారు.
ఇదిలా ఉండగా మొంథా తుఫాన్ వచ్చింది. పోయింది... అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. కానీ జగన్ బాధితులను పరామర్శించడానికి ఇవాళ బయలుదేరారు. ఆయన షెడ్యూల్ ప్రకారం బెంగళూరు నుంచి ప్రతి మంగళవారం వస్తారు - శుక్రవారం వెళ్తారు. ఆ ప్రకారం ఇవాళ బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి కి ఎప్పుడొచ్చారో కానీ పెడనకు వెళ్లి పొలాలను పరిశీలించారు. తాను ఎప్పుడూ చెప్పే స్క్రిప్ట్ ను మరోసారి చదివారు. జగన్ నిజాయితీగా రాజకీయాలు చేస్తే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తాను నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నానని నమ్మించడానికి చాలా కాలం పడుతుంది. ఎందుకంటే..ఆయన చేసిన పనులు.. నిర్వాకాలు అలా ఉన్నాయి. ఇప్పటికైనా ఆయన పెద్దాయన మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పినట్లుగా.. తాను నిజాయితీగా ఉంటే.. కార్యకర్తలు కూడా నిజాయితీగా ఉంటారు. కానీ జగన్ డిక్షనరీలో ఉండని ఒకే ఒక్క పదం నిజాయితీ. అందుకే ఆయన రాజకీయాలు ఫేక్ అనే ముద్ర పడిందని పలు పార్టీల రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos