పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. పార్టీ క్రియాశీలక సభ్యుడు అయిన మధుసూదన్ కుటుంబానికి జనసేన తరఫున రూ. 50 లక్షలు ప్రకటించారు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వారికి నివాళుర్పించేందుకు జనసేన మంగళగిరిలో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. గతంలో పలుమార్లు పాకిస్తాన్ ను ఓడించినా వారిబుద్ధ మారలేదన్నారు. మనం మత సామరస్యం పాటిస్తూ, లౌకిక దేశంగా ఉంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం ప్రజలను మతం అడిగి మరీ కాల్పులు జరిపి హత్య చేయడం దారుణమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళి అర్పిస్తున్నాం. ఏపీకి చెందిన చంద్రమౌళి, నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ సైతం ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మధుసూదర్ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామన్నారు పవన్ కల్యాణ్. ఉగ్రదాడులను ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా నాశనం చేయాలన్నారు. జమ్మూకాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos