ఏపీలో గతంలో విపక్షంలో ఉన్నప్పుడు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే వారు. ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగాలు ఉర్రూతలూగించేవి. అయితే ఇప్పుడు తొలిసారి జనసేన అధికారంలో ఉండటంతో ఆవిర్భావ దినోత్సాన్ని కాస్త ప్లీనరీగా మార్చి తొలుత మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తాజాగా దీనిపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ తొలిసారి గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్లీనరీ కోసం ఏర్పాట్లు నెల రోజుల క్రితమే మొదలయ్యాయి. ఇప్పటికే ప్లీనరీ సక్సెస్ చేసేందుకు పార్టీ తరఫున 14 కమిటీలను కూడా నియమించారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ రెగ్యులర్ గా పిఠాపురం వెళ్లి జనసేన నేతలతో భేటీ అవుతూ ప్లీనరీపై సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్లీనరీ మూడు రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించిన విషయం బయటపడింది.

మూడురోజుల పాటు అట్టహాసంగా ప్లీనరీ నిర్వహించాలని భావించిన జనసేన పార్టీ ఇలా హఠాత్తుగా ఎందుకు వెనక్కి తగ్గిందనే దానిపై జనసైనికులతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది. అయితే పార్టీ మాత్రం ఇప్పటివరకూ దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్ కానీ, కందుల దుర్గేష్ కానీ, ఇతర నేతలు కానీ తమ ప్రకటనల్లో మాత్రం మార్చి 14న జరిగే ప్లీనరీ అనే చెప్పడం మొదలుపెట్టారు. దీంతో మూడు రోజుల ప్లీనరీ ఒక్క రోజుకు పరిమితమవుతోందని అర్దమవుతోంది.

అయితే దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో అసెంబ్లీ సమావేశాలు, పవన్ ఆరోగ్యం, వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 వరకూ కొనసాగనున్నాయి. మధ్యలో మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించి రాజకీయ ప్రసంగాలు చేయడం సరికాదనే భావన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అలాగే అధినేత పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన మూడు రోజుల పాటు ఇందులో పాల్గొనే అవకాశాలు లేవు. అలాగే వివిధ వర్గాల నుంచి మూడు రోజుల ప్లీనరీకి బదులు ఒక రోజు సరిపోతుందనే సలహా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జనసేన రూటు మార్చినట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos