ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కోట వినుత వ్యక్తిగత పీఏ శ్రీనివాసులు చెన్నైలో హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్త్తు చేసిన పోలీసులు వినుతను అరెస్టు చేశారు. ఈ వివాదంపై స్పందించిన జనసేన పార్టీ అధినాయకత్వం వెంటనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వినుత వద్ద పీఏగా, డ్రైవర్ గా ఉన్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఈ మధ్య కనిపించకుండా పోయాడు. చివరకు చెన్నైలో ఓ మురికి కాలువలో శవమై కనిపించాడు. ఆయన శవాన్ని రికవరీ చేసుకున్న పోలీసులు మింట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి చేతి మీద జనసేన గుర్తు, వినుత పేరు ఉండటంతో ఆ దిశగానే పోలీసులు విచారణ చేపట్టారు. అప్పుడే తెలిసింది అది వినుత వద్ద పని చేసిన రాయుడు శవమని. అప్పటి నుంచి కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.
రాయుడు హత్య కేసు విచారణలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి వినూతతోపాటు ఆమె భర్త చంద్రబాబును కూడా చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లతోపాటు మరో ముగ్గర్ని కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు. చనిపోయిన రాయుడుకు మాకు ఎటువంటి సంబంధం లేదని జూన్ లో ప్రకటించారు వినుత. ఆమె వద్ద బొక్కసంపాలెం గ్రామానికి చెందిన సీహెచ్ శ్రీనివాసులు(రాయుడు) పీఏగా, డ్రైవర్ గా పనిచేశాడు. సడెన్ గత నెలలో అతన్ని తొలగించారు. ఆ వ్యక్తితో సంబంధం లేదని పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు.
విధుల నుంచి తొలగించిన పది పదిహేనురోజుల్లోనే రాయుడు శవమై తేలడంతో వినుతపై అనుమానం పెరిగింది. ఆ దిశగానే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇలాంటి అనుమానాలు ప్రజల్లో ఉండటం పోలీసులు అరెస్టు చేయడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన ప్రకటించింది. జనసేన పార్టీకి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ గా ఉన్న వేముపాటి అజయ్ కుమార్ పేరుతో వచ్చిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు" శ్రీకాళహస్తి నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్న వినుత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడమైంది. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదు అయిన విషయం పార్టీ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించడమైనది." అని పేర్కొన్న ప్రకటన వెలువడింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos