ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ నెలవారీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతీ నెల ఒకటో తేదీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయిస్తోంది. గతంలో వాలంటీర్లు పంపిణీ చేసిన ఈ పెన్షన్లను కూటమి సర్కార్ వచ్చాక మాత్రం సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. అయితే ప్రతీ నెల ఒకటో తేదీనే ఇస్తున్నా.. ఒక్కోసారి పరిస్ధితులను బట్టి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈసారి కూడా కొత్త ఏడాది 2026లో జనవరి పెన్షన్లు ఒకరోజు ముందే అందే అవకాశాలున్నాయి.

జనవరి ఒకటో తేదీ కొత్త ఏడాది వేడుకల సందర్భంగా, ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీనే పింఛన్ల పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మిగిలిన పింఛన్లను మాత్రం జనవరి 2వ తేదీ పంపిణీ చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోరారు. కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు ఈ మేరకు అవకాశం కలుగుతుందని వారు చెప్తున్నారు. గత ఏడాది కూడా ఇలాగే కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31న పెన్షన్ల పంపీణీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం యునైటెడ్ వెల్ఫేర్ జీఎస్ డబ్ల్యూఎస్ కోరుతోంది. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఇలా ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీ నిబంధనల్లో మార్పులు చేసి వెసులుబాట్లు కల్పించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈసారి కూడా ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos