రాయలసీమ లోని కూటమి పార్టీలోని ఇద్దరు నేతల మధ్య విచిత్రమైన పోరు నెలకొంది. బూడిద రవాణా కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాణరెడ్డి వర్గాలు కొట్టేసుకునేందుకు రెడీ అయ్యాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న ఆర్టీపీపీ నుంచి రోజూ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే బూడిదను తాడిపత్రిలోని కొన్ని సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తారు. వాటిని రవాణా చేసేందుకు మా వాహనాలంటే మా వాహనాలే వాడాలని అటు ఆది వర్గీయులు.. ఇటు జేసీ వర్గీయులు పట్టుబడుతున్నారు.

బూడిద మా దగ్గర ఉందని.. కాబట్టి మా వాహనాలతో తరలిస్తామని ఆదినారాయణరెడ్డి వర్గీయులు అంటున్నారు. కానీ తరలించేది తాడిపత్రికి కాబట్టి అవి మా వాహనాలే కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఇరువురి మధ్య పంచాయతీ పెరిగిపోయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటివి మాటలతో తేల్చుకోరు. డైరక్ట్ గా చేతలే. అందుకే ఆయన వార్నింగ్ ఇచ్చి.. వాహనాలతో ఆర్టీపీపీ వద్దకు వెళ్లేందుకు రెడీ అయ్యారు.

జమ్మలమడుగులో ఇతరులు ఏమి చేయాలన్నా మా కనుసన్నల్లో చేయాల్సిందేనని అనుకునే ఆదినారాయణరెడ్డి వర్గీయులు జేసీని అడుగు పెట్టనిచ్చేందుకు సిద్దంగా లేరు. ఇటీవల అదానీ సంస్థలపైనే దాడి చేశారు. ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయనకు ఎలా చెప్పాలో టీడీపీ నేతలకు అర్థం కావడం లేదు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయకపోతే రచ్చకెక్కుతారని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ఇరు పార్టీల నేతలు కోరుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos