ధర్మారం : ధర్మవరం నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం కల్పించే యోజనతో నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంస్కృతి సేవా సంస్థ సౌజన్యంతో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 09వ తేదీన ధర్మవరంలోని CNB కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న యువతీ యువకులు ఉద్యోగాల కోసం వివిధ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారని, కావున దేశంలోనే అతిపెద్దవైన దాదాపు 90 కంపెనీలను నిరుద్యోగుల చెంతకే తీసుకొచ్చి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. కావున నిరుద్యోగ యువతీ,యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలియజేశారు. ఈ మెగా జాబ్ మేళా లో బహుళ జాతీయ 90 కంపెనీలు పాల్గొంటున్నాయని, వాటి ద్వారా ధర్మవరం నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతి యువకులకు ఇంటర్వూలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. మెగా జాబ్ మేళాలో Techmahindra, EdubridgeIndia ( Capgemini), Hyundai Motors, Tata electronics, JY Software Solutions, ఫ్లిప్ కార్ట్, హెటేరో డ్రగ్స్ ,wipro , genpact,Techwish software, Dr Reddy's, Joyalukkas, కియా మోటార్స్, ముతూట్ ఫైనాన్స్, Quess Corp , Green tech ,Vetro techsoft solutions , Allsec టెక్నాలజీస్, అపోలో ఫార్మసీ,Beets L soft solutions,Empowerment solutions, Adecco solutions,Agile airport services,igneous IT pvt solutions,Amaraja batteries,KML ,Threads IT Pvt Ltd,AIL Dixon, కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ మెగా జాబ్ మేళాలో హాజరు అయ్యే నిరుద్యోగ యువతీ,యువకులు విద్యార్హతలు పదవ తరగతి,ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమా,బి. ఫార్మసీ /M. ఫార్మసీ, నర్సింగ్ / ఎనీ డిగ్రీ , ఎనీ బి.టెక్, పి.జి, చదివిన వారు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని,ఈమెగా జాబ్ మేళా లో ఎంపికైన అభ్యర్థులకి నెలకి రూ 10 వేల నుండి 50 వేల వరకు జీతం ఉంటుందని తెలియజేశారు.ఈ ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా విద్యార్హత పత్రాలు జిరాక్స్,ఆధార్ కార్డ్,రెండు ఫోటోలతో అర్హత కలిగిన నిరుద్యోగ యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8688466361 9490442576, 799825678 ఫోన్ నంబర్స్ కు సంప్రదించాలని తెలియజేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos