వైఎస్ జగన్ కు మరో కఠిన పరీక్ష ఎదురవుతోంది. అదే సొంత జిల్లా కడప జడ్పీచైర్మన్ ఉపఎన్నిక. మొన్నటి వరకూ జడ్పీచైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమరనాథరెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆ సీటు ఖాళీ అయింది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పాటు పలు స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చినా.. అందరి దృష్టి కడప జడ్పీచైర్మన్ ఎన్నికలపైనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఎలా నిర్వహించిందో ఎవరూ మర్చిపోలేరు. కడప జిల్లాలో ఎవరినీ నామినేషన్ కూడా వేయనివ్వలేదు. జడ్పీటీసీ పోస్టుల్లోనూ అంతే. ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. ఇందులో 49 మంది వైసీపీ జడ్పీటీసీ సభ్యులు. వీరిలో ప్రజుల ఓట్లు వేస్తే గెలిచింది 11 మంది మాత్రమే. మిగతా 38 మంది ఏకగ్రీవంగా ఎన్నికయినట్లుగా ప్రకటించుకున్నారు. ఒక్క విపక్ష సభ్యుడూ లేకపోతే బాగుండదని.. గోపవరం నుంచి మాత్రం టీడీపీ సభ్యుడిని నిలబడనిచ్చి .. గెలవనిచ్చారు. ప్రస్తుతానికి రెండు జడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలకు ముందే వైసీపీలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా జడ్పీటీసీలు వైసీపీకి గుడ్ బై చెబుతూ వస్తున్నారు. అప్పట్లోనే ఆరుగురు జడ్పీటీసీలు టీడీపీలో చేరారు. ఎన్నికల తర్వాత పులివెందుల టీడీపీ ఇన్ చార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డితో మెజార్టీ జడ్పీటీసీలు టచ్ లోకి వచ్చారు. అయితే వారిని ఇంకా నేరుగా పార్టీలోకి చేర్చుకోలేదు. చంద్రబాబు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈనెల 27న జరగనున్న కడప జడ్పీచైర్మన్ ఉప ఎన్నిక జగన్ కు పరువు సమస్యగా మారడంతో .. జడ్పీటీసీలను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు. ఓ సారి తాడేపల్లి పిలిపించుకుని బుజ్జగించారు. చాలా రోజుల క్రితమే బ్రహ్మంగారి మఠం మండలం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. జడ్పీటీసీలు పార్టీ మారకుండా సంతృప్తి పరచాలని ఆయనకు సూచించారు. ఆయన వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వo పట్ల మెజార్టీ వైసీపీ జడ్పీటీసీలు సానుకూలంగా లేరన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. కడప జడ్పీచైర్మన్ ఎన్నికలో టీడీపీ వ్యూహం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. టీడీపీకి అధికారికంగా ఒక్కరే సభ్యుడు ఉన్నాడు. అయితే జడ్పీటీసీలను ఆకర్షించి..వైసీపీని ఓడిస్తే మాత్రం అది జగన్ కు మరో ఘోరమైన ఓటమి అవుతుంది. ఇప్పటికే సాగునీటి ఎన్నికల్లో వైసీపీ వారు పోటీ చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు టీడీపీ పోటీ చేయడంపై ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos