స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) చెబుతున్న విషయాలు సినిమా కథలను మించి ఉన్నాయని  లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కస్టోడియల్ విచారణ పేరుతో తనను అరెస్టు చేశారని ఆయన ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టుకు తెలిపారు. తనపై మోపిన అభియోగాలను పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి మాట్లాడుతూ, "లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర ఎక్కడా లేదు. నా తప్పు లేకపోయినా, తప్పు చేసినట్లుగా నాపై తప్పుడు ఆధారాలను సృష్టించారని" ఆరోపించారు. తనపై ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతంలో ఏ కేసులోనూ అరెస్టు కాలేదని ఆయన గుర్తుచేశారు. సిట్ అధికారులు చెబుతున్న కట్టుకథలు నమ్మశక్యంగా లేవని ఆయన అన్నారు. రూ.11 కోట్ల నగదు గురించి ప్రస్తావిస్తూ, "ఆ రూ.11 కోట్లు నిజంగా నావే అయితే, వాటిపై నా వేలిముద్రలు ఉండాలి కదా? అసలు అంత పెద్ద మొత్తంలో నగదు ఒకే వ్యక్తి దగ్గర ఉంటుందా?" అని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటివరకు దాదాపు 300 మందిని విచారించారని, వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనకు పరిచయం లేదని ఆయన తేల్చిచెప్పారు. "కేసులో ప్రస్తావిస్తున్న చాలా మంది పేర్లను నేను ఇప్పుడే మొదటిసారి వింటున్నాను. సిట్ విచారించిన వారిలో కనీసం ఓ ఐదుగురిని పిలిచి, నేను తెలుసా అని అడగండని" ఆయన కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos