ఇరాన్ - ఇజ్రాయిల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా, పశ్చిమ దేశాలలో చెలరేగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే ఈ గ్యాస్ కొరతను అధిగమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం గృహ వినియోగదారులకు గ్యాస్ సమస్య లేదని, కమర్షియల్ సిలిండర్లు ఉపయోగించే వారికి కూడా గ్యాస్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించింది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంటగ్యాస్ సరఫరా సమస్యలను అధిగమించడం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. వంట గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా రేషన్ కార్డ్ దారుల కోసం కిరోసిన్ పంపిణీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇవాళ సోమవారం నుండి ఏపీలోని రేషన్ కార్డుదారులకు కిరోసిన్ అందనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. హర్ముజ్ జలసంధిలోని అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ నౌకల రాక ఆలస్యమవుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న విశాఖకు రావాల్సిన నౌక 26కు వాయిదా పడింది. దీంతో ప్రజలకు, గ్యాస్ కొరత ఇబ్బంది కలిగించకూడదని, గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 2,800 కిలో లీటర్ల కిరోసిన్‌ను రాష్ట్రానికి కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుత అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల సౌలభ్యం కోసం ఈ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా గిరిజన మరియు మారుమూల గ్రామీణ లబ్ధిదారులకు రేషన్ కార్డు పైన ఒక లీటర్ కిరోసిన్ ను రేషన్ దుకాణాల ద్వారా అందిస్తారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ కొరత పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గ్యాస్ సిలిండర్ల స్టాక్ లేదని, ముందు ముందు మరింత కష్టంగా ఉంటుందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వదంతులను నమ్మవద్దని, స్కూల్స్, హాస్పిటల్స్, హాస్టల్స్ కు గ్యాస్ సరఫరా అంతరాయం లేదని స్పష్టం చేశారు. అక్రమ రవాణాను అరికట్టడం కోసం ఓటీపీని అమలు చేస్తూ, బ్లాక్ మార్కెట్ కు పాల్పడేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos