ఒకప్పుడు విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచి టీడీపీలో కొనసాగిన కేశినేని నాని ఆ తర్వాత అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతే కాదు తనకు రెండుసార్లు టికెట్ ఇచ్చి గెలిపించిన చంద్రబాబు, లోకేష్ పైనే నిప్పులు చెరిగారు. తిరిగి వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయవాడలో హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో ఓ రేంజ్ లో వీచిన కూటమి గాలిలో తమ్ముడు కేశినేని చిన్ని చేతిలోనే ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.

అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో కేశినేని నాని టచ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే స్థానిక బీజేపీ నేతల్ని కలవడం, జాతీయ నేత గడ్కరీని సందర్భం వచ్చినప్పుడల్లా పొగడటం చూసి ఆయన కాషాయ గూటికి చేరిపోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తన ప్రజాసేవ కొనసాగుతుందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవలి మీడియా ఊహాగానాలకు ప్రతిస్పందనగా తన రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి తన వైఖరిని స్పష్టం చేస్తున్నానంటూ కేశినేని ఓ ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించానని, ఆ నిర్ణయం మారదని కేశినేని నాని తెలిపారు. అయితే, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను హృదయపూర్వకంగా నమ్ముతున్నట్లు తెలిపారు.

ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని కేశినేని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదన్నారు. కానీ విజయవాడలోని తన తోటి పౌరుల శ్రేయస్సు కోసం తన లోతైన అంకితభావంతో ముడిపడి ఉందన్నారు.తన రాజకీయ పునరాగమనానికి సంబంధించి ఎలాంటి నిరాధారమైన వార్తలను పట్టించుకోవద్దని ఆయన అందరినీ కోరారు.

విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, దాని ప్రజల అభివృద్ధి మరియు శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే తన దృష్టి ఉందని కేసినేని నాని అన్నారు. తన ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదే అభిరుచి, నిబద్ధతతో తన సేవను కొనసాగించడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos