మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మరో మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని, వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలు ఎన్నో ఉన్నాయని.. వారిని రాష్ట్రానికి ఆహ్వానించటంలో శాసనసభ్యులు కూడా సహకరించాలని కోరారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకురావడం తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని.. అందుకే ప్రతి ఒక్కరూ తనకు సహకరించాలని కోరారు.

త్వరలోనే ఐటీ పాలసీ కూడా తీసుకువస్తున్నామని.. రాష్ట్రంలో ద్వితీయశ్రేణ నగరాల్లో కో వర్క్సింగ్ స్పేసన్‌ దిశగా కార్యాచరణ మొదలుపెట్టామన్నారు మంత్రి. అదానీతో పాటు కొన్ని కంపెనీలు విశాఖపట్నంకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయని.. వచ్చే మూడు నెలల్లో విశాఖపట్నంలోని ఐటీ హిల్స్‌పై డేటా సెంటర్లు వస్తాయని ప్రకటించారు. నిక్సీ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని.. సింగపూర్ నుంచి సీ ల్యాండింగ్ ఇంటర్నెట్ కేబుల్ తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టం ఏర్పాటు కోసం ప్రయత్నం జరుగుతోందని.. అందుకే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వేగంగా నిర్మాణం జరుగుతోందన్నారు మంత్ర లోకేష్. విశాఖపట్నంలో హోటల్స్ కూడా నిర్మాణం కాబోతున్నాయని.. టూరిజం పాలసీ కూడా రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయన్నారు. గతంలోనే డేటా సెంటర్ కోసం అదానీతో ఒప్పందం చేసుకున్నామని.. కానీ ఆ తర్వాత అది ఆగిపోయిందన్నారు.

తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీల ప్రతినిధుల్ని కలిశానని.. తాను కలిసిన వారిలో చాలామంది.. గత ప్రభుత్వంలో కొంతమంది తమను వాటాలడిగినట్లు చెప్పారని లోకేష్ అన్నారు. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి తెచ్చారని.. కూటమి ప్రభుత్వం వచ్చాక తాము ఐటీ సంస్థల వాళ్లందరితో సమావేశమై వారి సమస్యల్ని తెలుసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు సంబంధించిన ఒక్క కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించలేదని.. ఉన్న కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారన్నారు మంత్రి నారా లోకేష్.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos