ఏపీలో 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా కూటమి నేతలు కసరత్తు వేగవంతం చేసారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ పథకాల అమలుకు ఇక ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే లోగానే అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్రం ఈ సారి అమలు చేసే పీఎం కిసాన్ పథకంతో పాటుగా తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నారు. ఇక.. ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకంలో మార్పులు చేస్తున్నారు.

ప్రతీ ఏటా అర్హులైన లబ్ది దారులకు మూడు సిలిండర్ల వరకు చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడు ఈ విధానంలో మార్పులకు నిర్ణయించారు. ఉచిత సిలిండర్ల పథకం అమలులో కొన్ని మార్పులు చేసి లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే నగదు జమ చేయాలని తాజాగా జరిగిన టీడీపీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. దీపం పథకానికి సంబంధించి మూడు సిలిండర్ల నగదుని లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే జమ చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఏపీలో ఉచిత సిలిండర్ల పథకం అమలుకు ఏటా రూ.2684.75 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదిలో అర్హత కలిగిన లబ్దిదారుకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు తొలుత సిలిండర్ తీసుకునే సమయంలో లబ్దిదారులు నగదు చెల్లించాల్సి వస్తోంది. ఆ తరువాత వారి ఖాతాల్లో ఆ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ముందుగానే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ కానుందని కూటమి నేతలు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos