ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ మేరకు వివిధ శాఖలకు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి అప్‌లోడ్ చేయాలని.. ఆ తర్వాత రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది.
ఉత్తర్వుల అనువాదానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాలనా వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభ తీర్మానించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ రెడ్డి హయాంలో తెలుగుకు కూడా కులం అంటించి మాట్లాడి.. తెలుగు మీడియం ఎత్తేశారు. ఈ క్రమంలో తెలుగు భాష అంతరించిపోతుందేమోనని కాపాడుకోవాలన్న అభిప్రాయాలు వినిపించాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.. తమ భాషను కాపాడుకుంటూనే.. ఇంగ్లిష్ లో ప్రావీణ్యం సంపాదించి ముందుకెళ్తున్నారని కానీ తెలుగు వాళ్లు మాత్రం ఇంగ్లిష్ మాత్రమే నేర్చుకోవాలన్నట్లుగా పరిస్థితి మారింది. దీన్ని మార్చే క్రమంలో తెలుగుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అధికార ఉత్తర్వులు తెలుగులో వస్తే ప్రజలకు కూడా అర్థమవుతాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos