ఏపీ ప్రభుత్వం తాజాగా మరో  సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలులోకి తెచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం..టెండర్ల విధానంలో పారదర్శకత ఉండాలంటూ 2019లో ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జ్యుడీషియల్ ప్రివ్యూ పారదర్శకత) చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జిగా నాడు ప్రభుత్వం నియమించింది. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి పరిశీలించాలని నాడు జగన్ సర్కార్ నిర్ణయించింది.

ఈ విధానంలో పలు లోపాలు ఉన్నాయని అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ తప్పు పట్టింది. ఎన్నికల అనంతరం  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త నిర్ణయం తీసుకుంది. జ్యుడీషియల్ ప్రివ్యూతో ఎలాంటి ప్రయోజనం లేదని తాజాగా రాష్ట్ర కేబినెట్ అభిప్రాయపడింది. టెండర్ల జారీలో కేంద్ర మార్గదర్శకాలు, విజిలెన్స్ కమిషన్ నిబంధనలు పాటిస్తున్నందున ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో నోటిఫికేషన్ జారీ అయింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos